ఈ పొడిని ఇలా తీసుకుంటే రక్తహీనత ,పొట్ట సమస్యలు తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది
Shahi Jeera Benefits : మనం వంటలలో రుచి కోసం ఎన్నో రకాల మసాలా దినుసులు వాడుతూ ఉంటాం. ముఖ్యంగా బిర్యానీలోను, కూర్మాలోను, మసాలా వంటకాలలో తప్పనిసరిగా సాజీర వాడుతూ ఉంటాం. అయితే సాజీరా వాడటం వలన ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయో చూద్దాం. సాజీరను పొడిగా తయారుచేసుకుని వంటల్లో వేసుకోవచ్చు.
అలాగే ఈ పొడి తో డికాషన్ తయారు చేసుకొని తాగవచ్చు. లేదా జీలకర్ర వలె తాలింపులో వేసుకోవచ్చు. కొంతమందికి సాజీర వాసన నచ్చదు. అలాంటివారు ఇప్పుడు చెప్పే విషయాలు తెలుసుకుంటే కచ్చితంగా సాజీర వాడతారు. పొట్టలో ఇరిటేషన్, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. పొట్టలో హాని కలిగించే బ్యాక్టీరియాను చంపేస్తుంది.
హైడ్రోక్లోరిక్ యాసిడ్ కంట్రోల్ గా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారికి హిమోగ్లోబిన్ తయారవటానికి బాగా సహాయపడుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరం చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. తెలివితేటలు, మేధాశక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. సాజీరా ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు వాడటం మంచిది. ఉదయం సమయంలో సాజీర డికాషన్ తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు.