కాఫీలో దాల్చినచెక్క పొడి కలిపి తాగితే ఏమి అవుతుందో తెలుసా?
coffee and cinnamon benefits : కాఫీని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు. చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగుతారు. కాఫీ తాగకపోతే రోజంతా .అదోలా ఉంటుంది.అంతలా కాఫీకి అలవాటు పడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రత్యేకమైన రుచి., వాసన కలిగి ఉండే కాఫీని లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కాఫీలో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. కాఫీలో చిటికెడు జాజికాయ పొడి కలిపి తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు. అలాగే ఒత్తిడి., టెన్షన్, ఆందోళన, తలనొప్పి అన్ని మానసిక సమస్యలు తొలగి ప్రశాంతత కలుగుతుంది.
బ్లాక్ కాఫీ లో నిమ్మరసం కలిపి తీసుకుంటే రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. శరీరంలో వ్యర్ధాలు తొలగిపోయి మైండ్ రిలాక్స్ అవుతుంది. కాఫీ లో దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దాంతో గుండెపోటు., గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి.
కాఫీలో డార్క్ చాక్లెట్ కలిపి తీసుకుంటే నీరసం, అలసట తగ్గి శరీరమంతా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆకలి నియంత్రణలో ఉంటుంది.కాబట్టి మీరు కూడా కాఫీలో ఇప్పుడు చెప్పిన వాటిని కలుపుకొని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు పొందండి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.