Healthhealth tips in telugu

శరీరంలో అధికంగా ఉన్నకొవ్వుని కరిగించడానికి 10 సులభమైన మార్గాలు

బరువు కోల్పోవటం అనేది ఒకటి, రెండు రోజుల్లో జరిగే పని కాదు. జీరో సైజ్ ఫిగర్ ని సాదించాలంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవాలి. సాధ్యమైనంత త్వరగా బరువు కోల్పోయి సన్నగా తయారు కావాలని అనుకుంటున్నాం. కానీ ఆరోగ్యకరముగా బరువు తగ్గటానికి చాలా సమయం పడుతుంది. దీనిని ఒక ప్రక్రియగా కొనసాగించి ప్రతి రోజు వ్యాయామాలు చేస్తూ ఆహారంలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఎలా బరువు కోల్పోవచ్చో కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం.
Weight Loss tips in telugu
1. తగినంత నిద్ర ఉండాలి
ఆరోగ్యకరముగా బరువు తగ్గటంలో నిద్ర కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.తగినంత నిద్ర ఉన్నప్పుడు జీవక్రియలు కూడా బాగా జరుగుతాయి. అంతేకాకుండా నిద్ర అనేది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించటమే కాకుండా అతిగా తినడాన్ని కూడా నియంత్రిస్తుంది.

2. తరచుగా తినటం
తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినటం వలన జీవక్రియల పనితీరు బాగుంటుంది. తద్వారా మీరు ప్రయత్నం లేకుండానే బరువు కోల్పోయే అవకాశం ఉంటుంది.
Weight Loss Tips in telugu
3. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్
ఉదయం మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ మీకు శక్తిని ఇస్తుంది. అంతేకాక తర్వాతి రోజు అదే సమయంలో ఆకలి వేసేలా చేస్తుంది. మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తక్కువగా తీసుకుంటారు కాబట్టి, మీరు తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు, ప్రోటీన్ మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకోండి.

4. సంగీతం వింటూ
వ్యాయామం అనేది బరువు కోల్పోవటానికి సమర్ధవంతంగా సహాయపడుతుంది. అయితే మీరు రొటీన్ కి బిన్నంగా మంచి జోష్ తో వ్యాయామం చేయటానికి మంచి సంగీతాన్ని ఎంచుకోండి. మీకు ఇష్టమైన పాటలను వింటూ మీరు కోరుకున్న ఫిగర్ కోసం జిమ్ లో కష్టపడండి.

5. కోక్ లను త్రాగటం మానేయాలి
అత్యదిక కేలరీలు,అత్యదిక చక్కెరతో ఉన్న సోడా మరియు షుగర్ డ్రింక్స్ త్రాగటం మానేయాలి. ఒక కోక్ లో 30 గ్రాముల చక్కెర ఉంటుందని మీకు తెలుసా? మీరు తొందరగా బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం ఇటువంటి షుగర్ డ్రింక్స్ త్రాగటం మానివేయటం చాలా మంచిది.

6.తక్కువ పరిమాణంలో ఆహారం
మీరు తినే ఆహారం బాగా తగ్గించకుండా మీ శరీరానికి అవసరమైన శక్తీ అందేలా ఆహారాన్ని తీసుకోవాలి. కానీ మీ భోజన పరిమాణాన్ని ( ఉదాహరణకు 3/4) కొద్దిగా తగ్గించుకుంటే వారం రోజుల్లో బరువు తగ్గటం అనేది మీరు
గమనించవచ్చు.
Eating Food in Hand
7. స్పోర్ట్స్
మీరు ఒక వారం రోజుల్లో బరువు కోల్పోవటానికి స్పోర్ట్స్ చాలా బాగా ఆశ్చర్యకరమైన రీతిలో సహాయపడతాయి. జాగింగ్, వాకింగ్, స్టెప్ ఏరోబిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్,డాన్స్,జుంబా డాన్స్,ఇంటిని శుభ్రం చేసుకోవటం వంటి వ్యాయామాలు అత్యంత ప్రభావవంతముగా బరువు తగ్గటంలో సహాయపడతాయి.

8. భోజనం మానకూడదు
భోజనం మానివేస్తే మీ జీవక్రియ వేగం తగ్గుతుంది. తద్వారా బరువు నష్టం ప్రక్రియ చాలా నెమ్మదిగా మరియు మరింత కష్టతరం అవుతుంది. అంతేకాక భోజనం మానివేయటం వలన టెంప్టేషన్ కూడా ఎక్కువ అయ్యి ఆకలి అనుభూతి ఎక్కువ అవుతుంది. అప్పుడు తినవలసిన దాని కన్నా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవటం
జరుగుతుంది.
Diet Plan
9. 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్
మీరు వారం రోజుల్లో బరువు కోల్పోవచ్చని అని అంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? దీనికి మీకు 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ సహాయ పడుతుంది. ఈ డైట్ ప్లాన్ ని ఒక నిపుణుడు సాయంతో చేస్తే మంచిది. మీరు ఒక బుక్ లో మీకు రోజువారీ ఆహారం ఎంత అవసరం, మీ ఆహారపు అలవాట్లు, మీరు ఎంత బరువు తగ్గాలని అనుకుంటున్నారో మొదలైన విషయాలను రాసుకోవాలి. ఈ విషయాలను రాసుకోవటం వలన ఒక పద్దతిలో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మీరు 7 రోజుల ఆరోగ్యకరమైన డైట్ ప్లాన్ చేసినప్పుడు డైట్ లో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు మరియు తృణధాన్యాలు ఉండాలని గుర్తుంచుకోండి.

10. సూప్
ప్రతి రోజు ఆహారంలో సూప్ తీసుకోవటం వలన జీవక్రియ సాఫీగా జరగటమే కాకుండా మెరుగుదల కూడా ఉంటుందని ఒక పరిశోదనలో తెలిసింది. ఇది కూడా మీరు సులభంగా బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.