Healthhealth tips in telugu

కొబ్బరి నూనెతో ఇలా బ్రష్ చేస్తే…చిగుళ్ల నుంచి రక్త స్రావం, వాపు,దంతక్షయం తగ్గుతాయి

coconut oil benefits in telugu :మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా? నిమ్మకాయ ఉందా?.. అది ఉందా ఇది ఉందా.. ఇలాంటి యాడ్స్ ని వినీ వినీ బోర్ కొట్టని తెలుగువారుండరు. రకరకాల ఫ్లేవర్లతో వచ్చిన టూత్ పేస్టుల కంటే సింపుల్ గా కొబ్బరి నూనె ఉపయోగిస్తే ఆరోగ్యకరమైన దంతాలు సొంతమవుతాయని చెబుతున్నారు నిపుణులు. పలు అధ్యయనాలు చేసిన తర్వాత కొబ్బరి నూనె చాలా శ్రేష్ఠమైనదని కనుగొన్నారు.

చిగుళ్ల ఆరోగ్యానికి:
కొబ్బరి నూనె చిగుళ్ల నుంచి రక్త స్రావం, వాపుని నివారిస్తుంది. అలాగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి చిగుళ్లలో పుండ్లు రాకుండా నివారిస్తుంది. అలాగే నాలుకని కొబ్బరి నూనెతో శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే ఫంగస్ ని నిర్మూలిస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. దంతాల ఆరోగ్యంపై ప్రభావం చూపించే ఇతర హానికారక క్రిములను సమూలంగా నాశనం చేయడంలో కొబ్బరినూనె పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుందని ఐరిష్ సైంటిస్టులు ప్రయోగాత్మకంగా కనిపెట్టారు.

కొబ్బరినూనె పేస్ట్ కి కావాల్సిన పదార్థాలు:

అరకప్పు కొబ్బరి నూనె
2 స్పూన్ల బేకింగ్ సోడా
తగినంత పెప్పర్ మెంట్ ఆయిల్ (ఇది ఇష్టమైన వారు వేసుకోవాలి)

తయారి విధానం
అన్నింటినీ ఓ గిన్నెలో వేసుకుని బాగా కలపాలి. పేస్ట్ లా తయారయ్యే వరకు బాగా మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. దీనిని సాధారణ పేస్ట్ లకు బదులుగా వాడితే మంచి ఫలితం లభిస్తుంది.