ఈ మూలికతో జ్ఞాపకశక్తి నుండి అధిక బరువు తగ్గేవరకు బోలెడన్నీ లాభాలు..అసలు నమ్మలేరు
Ashwagandha Benefits: ఔషధ మూలికల్లో అశ్వగంధ ఒక పురాతన మూలిక. మూడు వేల సంవత్సరాల నుండి ఈ మూలికను వాడుతున్నారు. ఇది శరీరంలో లోపల, బయట ఆరోగ్యవంతంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. అశ్వగంధలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, న్యూట్రీషియన్ సమృద్దిగా ఉండుట వలన శరీరం ఎటువంటి సమస్యలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ లెవల్ పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడిని పెంచే హార్మోను ఎక్కువగా విడుదల కాకుండా చూస్తుంది. ఒకవేళ ఎక్కువగా విడుదల అయితే ఆ ప్రభావం షుగర్ లెవల్స్ మీద పడుతుంది. అశ్వగంధలోని వితాఫెరిన్ అనే పదార్ధం క్యాన్సర్ ని అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది.
టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి వంటి వాటిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేయటమే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డిప్రెషన్ నుంచి బయటపడతారు. నెగిటివ్ ఆలోచనల నుండి పొజిటివ్ ఆలోచనల వైపు సాగేలా చేస్తుంది. కండరాలకు బలాన్ని అందిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
అశ్వగంధ వాడే వారి బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. మతిమరపు లక్షణాలు వారిలో కనిపించవు.చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. జీవక్రియను పెంచి కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఎంత మోతాదులో తీసుకోవాలో అనే విషయాన్ని ఆయుర్వేద వైధ్య నిపుణున్ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.