రాత్రి పడుకోవటానికి ముందు ఈ 5 ఆహారాలను తింటే ఏమి అవుతుందో తెలుసా?
Sleeping Disorder: మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ కంటి నిండా నిద్ర ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. నిద్ర సరిగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే కొన్ని ఆహారాలను తీసుకోకూడదు. ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.
రాత్రి పడుకోవడానికి ముందు .జంక్ ఫుడ్ అసలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే వాటిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవి త్వరగా జీర్ణం కాక నిద్ర సరిగా పట్టదు. కాబట్టి జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటేనే మంచిది.
కొంతమంది రాత్రి పడుకోవడానికి ముందు అంటే భోజనం చేశాక టీ తాగుతూ ఉంటారు. కాఫీలో మాదిరిగా టీలో కూడా కెఫీన్ ఉంటుంది. రాత్రి పడుకోవటానికి ముందు టీ తాగితే ఆ ప్రభావం నిద్ర మీద పడి నిద్ర సరిగా పట్టక నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది.
రాత్రి డిన్నర్ లో స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే అది త్వరగా జీర్ణం కాక గ్యాస్., ఎసిడిటీ సమస్య కు కారణం అవుతుంది. దాంతో సరిగా నిద్రపట్టదు.
చాలామంది రాత్రి భోజనం అయ్యాక కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీలోని కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాఫీ తాగడానికి ఉదయం లేదా మధ్యాహ్నం సమయాలు మంచివి.
మాంసాహారం రాత్రి సమయంలో తినకూడదు. మాంసాహారంలో కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల రాత్రిపూట మాంసాహారానికి దూరంగా ఉంటేనే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.