1 స్పూన్ పొడి-కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు ఉండవు
calcium rich foods : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో Calcium లోపం అనేది చాలా మందిలో కనపడుతుంది. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎముకలు బలహీనంగా మారటం, ఎముకల్లో గుజ్జు అరిగిపోయి టక్ టక్ అని శబ్ధం రావటం మరియు రక్తహీనత వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఒక పొడిని తయారుచేసుకొని రోజుకి ఒక స్పూన్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే సరిపోతుంది. ఈ పొడి తయారి కోసం నాలుగు స్పూన్ల నల్ల నువ్వులు, ఒక స్పూన్ గసగసాలు, 10 బాదం పప్పులను వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
ఈ పాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో గాని, రాత్రి పడుకోవటానికి అరగంట ముందు గాని తాగవచ్చు. ఈ పాలను 15 రోజులపాటు తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత, అలసట,నీరసం,నిస్సత్తువ వంటి సమస్యలు ఏమి ఉండవు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో తాగాలి.
ఉదయం సమయంలో తాగితే రోజంతా హుషారుగా ఉంటారు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తిని మరియు కంటి చూపును బాగా పెంచుతాయి. ఈ పాలను ప్రతి రోజు తాగి calcium లోపాన్ని తగ్గించుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.