రోజుకు ఎన్ని అరటి పండ్లను తినవచ్చో తెలుసా…ఏ సమయంలో తినాలి
Banana Side Effects in Telugu :అరటిపండు అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇష్టంగా తింటారు. అరటిపండు సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. అరటి పండు తియ్యని రుచి కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది .అరటిపండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
అరటి పండులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది అందుకే డాక్టర్ రక్తపోటు సమస్య ఉన్న వారిని రోజుకు ఒక అరటిపండు తినమని చెప్పుతూ ఉంటారు. అరటి పండులో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలసట, నీరసం ఉన్నప్పుడు ఒక అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. రోజుకు ఒక అరటి పండు తింటే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే అరటి పండులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా అరటి పండ్లు ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా అరటి పండ్లు తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అరటి పండులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.
అరటి పండ్లను ఎక్కువగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ పై పడుతుంది అంతేకాకుండా ఇతర ఆహారాలు నుండి పోషకాలను గ్రహించి శక్తి తగ్గుతుంది. కడుపునొప్పి, గ్యాస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రోజులు రెండు అరటి పండ్లను మించి తినకూడదు.
ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏదైనా లిమిట్ గా తింటేనే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజులో 2 నుంచి 3 అరటి పండ్లను తినవచ్చు. అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా రోజులో కనీసం 1 పండును తినవచ్చు. అయితే దాన్ని వారు మధ్యాహ్నం భోజనం చేశాక గంట ఆగి తింటే మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.