Beauty Tips

Puffy eyes:ఇలా చేస్తే 15 నిమిషాల్లో కంటి కింద నల్లని మచ్చలు,వాపు, ఉబ్బు అన్నీ తగ్గిపోతాయి

puffy eyes Home Remedies : కంటి కింద చాలా మందికి ఉబ్బు ,నల్లని మచ్చలు,వాపు వంటివి వస్తూ ఉంటాయి. సాదరణంగా ఇటువంటి సమస్యలు ఆల్కాహాల్ ఎక్కువగా సేవించేవారికి, సరిగ్గా నిద్ర లేనివారికి అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తుంది. వీటిని తగ్గించుకోవటానికి కీర దోస చాలా బాగా సహాయపడుతుంది.

కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని వడకట్టి రసం తీయాలి. ఈ రసంలో పలుచని దూదిని ముంచాలి. దూదిని తీసుకోని రెండు కళ్ళ క్రింద పెట్టుకోని సుమారు 15 నిముషాలు ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే కంటి కింద ఉబ్బు తగ్గటమే కాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

కీరదోసకాయలో ఆస్కార్బిక్ మరియు కాఫిక్ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల కళ్ళక్రింద చర్మంలో నీటిని తగ్గించి వాపు, కళ్ళ ఉబ్బు తగ్గుతుంది.
కీరదోసకాయలో ఉండే విటమిన్ A, యాంటీఆక్సిడెంట్స్ కళ్ళ ఇరిటేషన్ తగ్గిస్తుంది. దీనిలో ఉండే 95శాతం వాటర్ కంటెంట్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దాంతో కళ్ళు రిఫ్రెష్ అవుతాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం సాగకుండా, వదులవకుండా నివారిస్తుంది.

కీరదోసలో విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటిచూపును మెరుగుపరచి కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి వారంలో కీరదోసను రెండు సార్లు తీసుకోవాలి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కీరదోసకాయను చేర్చుకోవడంతో పాటు, కళ్ళకు అప్లై చేయడం వల్ల కూడా డబుల్ బెనిఫిట్స్ పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.