Healthhealth tips in telugu

పైసా ఖర్చు లేకుండా ఒంట్లో రక్తం పెరిగి రక్తహీనత సమస్య జీవితంలో లేకుండా చేస్తుంది

cauliflower stems : క్యాలీఫ్లవర్ ని వండినప్పుడు వాటి కాడలను పాడేస్తూ ఉంటాం. వాటిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య నుండి బయట పడాలంటే ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
cauliflower stem
పురుషుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 14 నుండి 16 గ్రాములు, అలాగే స్త్రీలలో 12 నుండి 14 గ్రాములు వరకు ఉండాలి. హిమోగ్లోబిన్ శాతం పెరగటానికి, రక్తకణాలు వృద్ది చెందటానికి ప్రతి రోజు సుమారుగా 30 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది.క్యాలీఫ్లవర్ లో కంటే కాడల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. క్యాలీఫ్లవర్ కాడల్లో ఐరన్ చాలా సమృద్దిగా ఉంటుంది.

100 గ్రాముల క్యాలీఫ్లవర్ కాడలలో దాదాపుగా 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిని కూర రూపంలో గాని, ఫ్రై రూపంలో గాని తినవచ్చు.
అలాగే పాలు పోసుకుని కూరగా చేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. వారంలో మూడు సార్లు క్యాలీఫ్లవర్ కాడలను ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.

రక్తహీనత సమస్య ఉన్నప్పుడూ సాధ్యమైనంత వరకు ఆహారంలో మార్పులు చేసుకొని ఆ సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలు అప్తించలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.