లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా ?
liver healthy foods :మన శరీరంలో కాలేయం అనేది ముఖ్యమైన అవయవం. ఇది గ్లూకోస్ తయారుచేయటానికి కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం తీసుకున్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం చేసి పోషకాలను రక్తంలోకి ప్రవహించేలా చేస్తుంది. అందువల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కాలేయానికి ప్రమాదం కలిగించే బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఓట్స్
చాలా మంది అధిక బరువు సమస్య నుంచి బయట పడటానికి ఓట్స్ వాడుతూ ఉంటారు. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే బీటా-గ్లూకాన్స్ అనే సమ్మేళనాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రెండు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో కాలేయానికి సహాయం చేస్తాయి. అంతే కాకుండా కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
కాఫీ
మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగుతూ ఉంటారు. రోజుకు ఒక కప్పు కాఫీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాలేయంలో కొవ్వు కరిగించటానికి అలాగే కొవ్వు పెరగకుండా కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సహాయపడతాయి.
గుడ్లు
గుడ్లలో సల్ఫర్ సమ్మేళనాలు, మిథైలేషన్ ఎలిమెంట్స్ మరియు గ్లూటాతియోన్, ప్రొటీన్లు విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. గుడ్లలో కెరోటినాయడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.