విటమిన్ ‘E’మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా…అసలు నమ్మలేరు
Vitamin E Foods : మన శరీరంలో విటమిన్ల పాత్ర చాలా కీలకమైంది. అవి ఏమాత్రం లోపించినా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకొనేది విటమిన్ ‘E’.. ఇది అందం.. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ E మన ఆరోగ్యానికి ఎంత సహాయపడుతుందో వివరంగా చూద్దాం. ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
అధిక బరువు
విటమిన్ ‘E’కి కొవ్వును కరిగించే శక్తి ఉంది. వూబకాయం ఉన్నవారు తరచూ విటమిన్ ‘ఇ’ లభించే పోషకాలను తీసుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు
దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను దూరం చేస్తాయి. క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మతిమరుపు సమస్య ఉండదు. ఈ విటమిన్ చూపు స్పష్టతకు కూడా తోడ్పడుతుంది.
రక్తకణాల వృద్ధి
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్త నాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది. అంతేకాదు మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది.
చర్మసంరక్షణ
పొడిచర్మం గలవారు విటమిన్’ఇ’ లభించే పోషకాలు తీసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. అలానే దద్దుర్లు, దురద వంటివాటిని తగ్గిస్తుంది. అంతేకాదు అతినీలలోహిత కిరణాలను నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
నొప్పినివారిణి
కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కండరాలను దృఢపరుస్తుంది. అవి తేలికగ్గా కదలడానికి తోడ్పడుతుంది. వయసు పైబడుతున్నవారు ఈ విటమిన్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలానే ఎదిగే చిన్నారులకు కూడా ఇవ్వాలి.
విటమిన్’ఇ’ లభించే పదార్థాలు
ఆకుకూరలు, పొద్దుతిరుగుడు, నట్స్, టమాట, గుమ్మడికాయ, చిలగడదుంప, రాక్‌ఫిష్, బొప్పాయి, బ్రొకోలీ.. వంటివాటిల్లో సమృద్ధిగా విటమిన్ ‘ఇ’లభిస్తుంది.