ఈ టీ తాగితే జ్ఞాపక శక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది
Saffron Tea : అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో కుంకుమ పువ్వు ఒకటి. ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వులో ఐరన్, మెగ్నీషియం, కాల్సియం, పొటాషియం, జింక్, కాపర్,సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి.
కుంకుమ పువ్వుతో టీ తయారుచేసుకొని తాగితే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్ మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపును దూరం చేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గిస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ టీ తాగితే ఆ సమస్య నుండి బయట పడతారు. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేసి రక్తప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక ఈ టీ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఈ టీని రోజులో ఒకసారి తాగితే సరిపోతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి 2 లేదా 3 కుంకుమపువ్వు రేఖలు వేసి 2 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చిన్న అల్లం ముక్క, 3 పుదీనా ఆకులు వేసి మరో 2 నిమిషాలు మరిగించి గ్లాస్ లో వడకట్టి తాగాలి. రుచి కోసం నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.