Healthhealth tips in telugu

ఈ నూనెలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం

Sesame Oil Benefits :నువ్వుల నూనెలో అనేక పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. నువ్వులనూనెలో బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. నువ్వుల నూనెను వంటల్లో వాడవచ్చు.
sesame oil benefits
నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి సహాయపడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నువ్వులు సెసామిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగి వుంటాయి. గుండె జబ్బులు, గుండెపోటు అవకాశాలను తగ్గిస్తుంది. పక్షవాతం వంటి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం దీనికి ఉంది.

నువ్వుల నూనెలో భాస్వరం, కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నువ్వుల నూనెలో ఉండే ట్రిప్టోఫాన్‌ గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. కీళ్ల నొప్పులను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ నువ్వుల నూనెలో చిటికెడు శొంఠి పొడి, చిటికెడు ఇంగువ కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇందులో నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది. ఇది ఒత్తిడి తగ్గించడంలో సహాయ పడుతుంది. నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ రాత్రి ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.