వీటిని తింటే రోగనిరోధక శక్తిని పెంచి చెడు కొలెస్ట్రాల్,డయాబెటిస్,అధిక బరువును తగ్గిస్తుంది
Dabbakaya Benefits In telugu :సిట్రస్ జాతికి చెందిన దబ్బపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే బయోఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన వేసవికాలంలో ఈ దబ్బపండు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకొనే వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఈ ఎరుపు రంగు దబ్బపండులో లికోపిన్ ఉండటం వలన కొన్ని రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దీనిలో 40కిపైగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా పనిచేస్తుంది.
మనలో చాలామంది దబ్బకాయతో ఆవకాయ, పచ్చడి, పులిహార వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పప్పుకూరల్లో, చట్నీ, చింతపండు బదులుగా దబ్బపండు రసాన్ని వాడవచ్చు. దబ్బకాయ షర్బత్ చాలా మంచిది. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.