కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టే Rowan Berry గురించి మీకు తెలుసా?
Rowan Berry Benefits In telugu : ఆపిల్ జాతికి చెందిన రోవాన్ బెర్రీ ఇప్పుడు బాగా దొరుకుతుంది. మనకు డ్రైగా ఆన్లైన్ స్టోర్ లలో లభ్యం అవుతుంది. రోవాన్ పండ్లలో విటమిన్ సి, ఇ, సోర్బిక్ ఆమ్లం, డైటరీ ఫైబర్, ఆంథోసైనిన్స్, టానిన్లు, పాలీఫెనోలిక్ సమ్మేళనాలు సమృద్దిగా ఉంటాయి. ఈ పండుతో టీ తయారుచేసుకొని తాగవచ్చు.
ఈ టీ తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన క్యాన్సర్ కణాలతో పోరాటం చేసి క్యాన్సర్ కణాలు వృద్ది చెందకుండా చేస్తుంది. ఈ పండులో టానిన్ ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఈ పండులో ఉండే పోషకాలు కంటికి ఒత్తిడి లేకుండా చూడటమే కాకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, సోర్బిక్ ఆమ్లం, ఆస్కార్బిక్ ఆమ్లం చర్మ ఆరోగ్యన్ని రక్షించడానికి పనిచేస్తాయి.
ఈ పండు మూత్ర మార్గాన్ని శుభ్రపరచడంలో. పిత్తాశయంలోని రాళ్ళను, కిడ్నీలో రాళ్ళను, మూత్రాశయం నుంచి కలిగే మంట నుంచి ఉపశమనన్ని ఇస్తుంది. మూత్రనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఈ రోవాన్ బెర్రీ మొక్క నుంచి అందే బెరడు, ఆకులు, పండ్లు, మన శరీరానికి మేలు చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.