షేన్ వార్న్ బౌలింగ్ ను బాదడం లో సచిన్ కు స్ఫూర్తి ఎవరంటే…
Shane Warne :క్రికెట్ ప్రపంచాన్ని తన లెగ్ స్పిన్ మాయాజాలంతో చుట్టేసి కట్టి పడేసిన క్రికెట్ లెజెండ్ స్పిన్ మాంత్రికుడు ఇక లేడు అనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని బాధాతప్తం చేసింది.
అప్పటిదాకా ప్రపంచ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్స్ దే హవాగా ఉండేది. అయితే Shane Warne అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన వెంటనే తన లెగ్ స్పిన్ మాయాజాలం తో క్రికెట్ ప్రపంచాన్ని మైమరపించాడు. యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ గ్రేట్ బ్యాట్స్ మాన్ మైక్ గాటింగ్ ను ఔట్ చేసిన బంతి ఈ శతాబ్దపు బౌల్డ్ గా పేర్కొంటారు.
అలాంటి హేమాహేమీలు ను గడగడ లాడించిన Shane Warne బౌలింగ్ ను మన సచిన్ తన బ్యాటింగ్ తో తుత్తునియలు చేసేవాడు. అలా సచిన్, Shane Warne కు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు, Shane Warne కు సింహస్వప్నం అయాడు.
అసలు నిజానికి Shane Warne బౌలింగ్ ను సచిన్ కు ముందే మన ఇండియన్ బ్యాట్స్ మ్యాన్ సులువుగా ఎదుర్కొని సచిన్ కు మార్గ నిర్దేశం చేసింది ఎవరూ అంటే… నవజోత్ సింగ్ సిద్దు… అవును మొదటినుండి నవజోత్ సింగ్ సిద్దు స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొనే వాడు. అలానే Shane Warne బౌలింగ్ ను కూడా అలవోకగా ఆడేసేవాడు సిద్దు.
నిజానికి సచిన్ కూడా మొదట్లో Shane Warne ను ఎదుర్కోవడంలో తడబడ్డాడు. సిద్దు వార్న్ బౌలింగ్ ను ఎదుర్కొంటున్న తీరును చూసాక సచిన్ స్ఫూర్తి పొందాడు.
అంతే అప్పటినుండి సచిన్ Warne కు సింహస్వప్నం అయాడు.