దానిమ్మలో ఉన్న ఆ ప్రయోజనాలు తెలుసా…అసలు నమ్మలేరు
pomegranate Benefits in telugu :పురాతన సంస్కృతిలో దానిమ్మను ‘స్వర్గం పండు’ గా భావించేవారు. ఈ పండు జ్యుసీ, క్రంచి కలయకతో అద్భుతంగా ఉంటుంది. అలాగే దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. సంప్రదాయబద్దంగా, దానిమ్మను ఆరోగ్య చిహ్నంగా
పిలుస్తారు. అనేక ఆయుర్వేద మరియు హెర్బల్ మెడిసినల్ గ్రంధములలో దానిమ్మను ఒక సహజ ఔషధంగా మరియు దాని ఉపయోగాల గురించి ప్రస్తావించారు. ఇక్కడ దాన్నిమ్మ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
1. గుండె వ్యాధులను నిరోదిస్తుంది
దానిమ్మలో శక్తివంతమైన పోలిఫెనోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటుంది. ధమనుల యొక్క గోడల మీద ఫ్రీ రాడికల్ నష్టంను నిరోధించడానికి యాంటీ ఆక్సిడెంట్ సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది. కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణం అయిన ఫలకం మరియు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోదిస్తుంది.
2. రక్తపోటును తగ్గిస్తుంది
దానిమ్మ సీరం యాంజియోటెన్సిన్ ని ఎంజైమ్ గా మార్చి రక్తపోటు తగ్గటానికి సహాయపడుతుంది. దానిమ్మలో పునిసిక్ ఆమ్లం ఉండుట వలన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజెరైడ్స్ మరియు రక్తపోటు తగ్గటానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనంలో దానిమ్మ పండులో ఉండే కాంపౌండ్స్ మధుమేహం మరియు అధిక LDL స్థాయిలు ఉన్న రోగుల్లో హృద్రోగ కారకాలను తగ్గించటానికి సహాయపడతాయని తెలిసింది.
3. క్యాన్సర్ నిరోధానికి సహాయం
రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ రకాలను నిరోదించటంలో దానిమ్మ సహాయపడుతుంది. ఈ రుచికరమైన పండులో పోలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాలు దానిమ్మ రసం కణిత కణాల వృద్ధిని తగ్గించటం మరియు వాటి సహజ మరణంను ప్రేరేపిస్తుందని నిరూపించాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సామర్ధ్యం కారణంగా క్యాన్సర్ మీద పోరాటం చేస్తుంది.
4. జీర్ణక్రియకు సహాయం
దానిమ్మలో పైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కానీ మన బిజీ జీవనశైలి కారణంగా పండ్లు మరియు కూరగాయలకు బదులుగా జంక్ ఆహారాల పట్ల ఆకర్షితులం అవుతున్నాం. మన ఆహారంలో దానిమ్మను బాగంగా చేసుకుంటే మన శరీరానికి అవసరమైన పైబర్ అందుతుంది. ఒక దానిమ్మలో35 గ్రా వరకు పైబర్ ఉంటుంది.
5. రోగనిరోధక శక్తి పెంచడానికి
దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ సమృద్ధిగా ఉండటం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియో ఫ్లోరోసిస్ వంటి రోగనిరోధక సంబంధిత రుగ్మతలతో బాధపడే వారికి బాగా సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన యాంటీబాడీల ఉత్పత్తిని మరియు రోగనిరోధక శక్తి అభివృద్ధిని పెంచుతుంది. అందువలన దానిమ్మ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి మరియు సాధారణ అనారోగ్యం మరియు ఇన్ఫెక్షన్స్ రాకుండా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.