Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు-అధిక బరువు,డయాబెటిస్, రక్తహీనత,గుండె సమస్యలు అసలు ఉండవు

jowar Benefits : జొన్నలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన పూర్వీకులు జొన్నలను ఎక్కువగా వాడేవారు. మరలా ఇప్పుడు మారిన జీవన శైలి పరిస్థితులకు అనుగుణంగా జొన్నల వాడకం పెరిగింది. జొన్నలతో అన్నం వండుకోవచ్చు.అలాగే జొన్నలతో రవ్వ, పిండి తయారు చేసుకుని ఉప్మా, రొట్టెలు,చపాతీలను తయారు చేసుకోవచ్చు.

జొన్నలను ఎలా తిన్నా వాటిలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. జొన్నలలో ఉండే మెగ్నీషియం శరీరంలో కాల్షియం శోషణను పెంచుతుంది. అలాగే కాల్షియం స్థాయిలను నిర్వహించటానికి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
cholesterol reduce foods
జొన్నలలో విటమిన్ బి సమృద్దిగా ఉండుట వలన కొత్త కణజాలాలు మరియు కణాలను నిర్మించడానికి సహాయపడుతుంది. జొన్నలలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Weight Loss tips in telugu
అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపు ఉబ్బరం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే ఆకలిని నియంత్రణలో ఉంచటం మరియు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన జొన్నలను తింటే అధిక బరువు సమస్య నుండి చాలా తేలికగా బయటపడవచ్చు.
Diabetes symptoms in telugu
డయాబెటిస్ ఉన్నవారికి జొన్నలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే జొన్నలో ఉండే ఊకలో టానిన్ సమృద్దిగా ఉంటుంది . ఇది శరీరంలో చక్కెర మరియు పిండి పదార్ధాల శోషణను తగ్గించే ఎంజైమ్‌లను స్రవిస్తుంది. దాంతో శరీరంలో గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
Top 10 iron rich foods iron deficiency In Telugu
జొన్నలలో రాగి, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తప్రసరణ బాగా జరగటానికి రక్తకణాల అభివృద్దికి సహాయపడుతుంది. రాగి అనేది శరీరం ఐరన్ బాగా గ్రహించటానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు జొన్నలను ఆహారంలో బాగంగా చేసుకుంటే రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలసట,నీరసం,నిసత్తువ లేకుండా చేస్తుంది. వారంలో 2 లేదా 3 సార్లు ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.