Healthhealth tips in telugu

Thyroid Control Tips:తేనెలో నానబెట్టి తింటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు

Thyroid Control Tips-walnut benefits in telugu :ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళల్లో కనిపించే సమస్య థైరాయిడ్ సమస్య. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపో థైరాయిడిజం రెండోది హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి మోతాదు కంటే తక్కువ హార్మోను విడుదల చేస్తే అది హైపోథైరాయిడిజం అని అంటారు.

ఎక్కువ హార్మోన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. అయితే ఎక్కువగా హైపోథైరాయిడిజం అనేదే కనబడుతుంది. చాలా తక్కువ మందిలో హైపర్ థైరాయిడిజం కనబడుతుంది. థైరాయిడ్ సమస్య ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.ఈ హార్మోన్ ని కంట్రోల్లో ఉంచుకోవటం చాలా ముఖ్యం.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అధిక బరువు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవటం, మలబద్ధకం, ఒత్తిడి, తరచుగా నీరసం వంటివి వస్తూ ఉంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే వాల్నట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాల్ నట్స్ తేనెలో మూడు గంటలు నానబెట్టి తింటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయోడిన్ త‌గ్గితే హైపో థైరాయిడ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

అయితే అయోడిన్ త‌గ్గడానికి ప్ర‌ధాన కార‌ణం సెలీనియం స్థాయి తక్కువగా ఉండ‌ట‌మే.అంటే, సెలీనియం సమృద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సెలీనియం అనేది వాల్ నట్స్ లో చాలా సమృద్దిగా ఉంటుంది. సెలీనియం అనేది థైరాయిడ్ గ్రంథి ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంతో పాటు థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులుండకుండా చూస్తుంది. వాల్ నట్స్ తీసుకొని థైరాయిడ్ సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.