కేవలం 1 గ్లాస్ కఫం,శ్లేష్మం బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రం అయ్యి కెపాసిటీని పెంచుతుంది
Lung Capacity Drink : శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు అలాగే కఫము,శ్లేష్మము మరియు ఊపిరితిత్తుల్లో కణాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఊపిరితిత్తులు బాగా పనిచేసి ఆక్సిజన్ లెవెల్స్ బాగుండాలంటే ఇప్పుడు చెప్పే కషాయం తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి దానిలో చిన్న అల్లం ముక్క లేదా పావుస్పూన్ శొంఠి పొడి, ఒక స్పూన్ వాము,10 పుదీనా ఆకులు,పావు స్పూన్ అతి మధురం పొడి, 10 మిరియాలను పొడిగా చేసి వేసి 5 నుంచి 7 నిమిషాలు బాగా మరిగించి గ్లాసులోకి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఉదయం ఒకసారి సాయంత్రం మరొకసారి తాగవచ్చు. ఈ కషాయం తాగటం వలన ఆస్తమా, బ్రోన్కైటిస్, కఫం మరియు శ్లేష్మం మరియు ఇతర ఊపిరితిత్తుల సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఊపిరితిత్తుల కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఈ కాషాయానికి తీసుకున్న 5 పదార్ధాలు ఊపిరితిత్తులను శుభ్రం చేయటమే కాకుండా రక్తాన్ని కూడా శుద్ది చేస్తాయి. లంగ్ కెపాసిటీని పెంచుతుంది. గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.