Healthhealth tips in telugu

ఇలా చేస్తే నోటి పూత చిటికెలో మాయం అవుతుంది…అసలు అశ్రద్ద చేయవద్దు

Mouth Ulcers Home Remedies : నోటి పూత సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏమి తినాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే నోటి పూత సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదని నిపుణులు చెప్పుతున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే సమస్య నుండి బయట పడటానికి ప్రయత్నాలు చేయాలి. మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

పసుపు నోటి పూత సమస్యను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లెమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు సమృద్దిగా ఉండటం వలన నోటి పూతను తగ్గిస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ లో సగం పసుపు వేసి బాగా కలిపి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించాలి.

ఈ విధంగా రోజులో మూడు సార్లు చేస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే తీసుకొనే ఆహారంలో కూడా పసుపు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ చిట్కాతో పాటు మరో చిట్కాను కూడా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. నోటి పూత ఉన్న ప్రదేశంలో నెయ్యి రాయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు రాస్తే సరిపోతుంది.

ఇలా నెయ్యి రాస్తూ పసుపు నీటిని పుక్కిలిస్తూ ఉంటే కేవలం మూడు రోజుల్లో నోటి పూత సమస్య మాయం అవుతుంది. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.