Healthhealth tips in telugu

1 గ్లాస్ తాగితే చాలు యూరిన్ ఇన్ ఫెక్షన్ ,అధిక బరువు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ అనేవి జీవితంలో ఉండవు

Bottle Gourd health benefits: సొరకాయను సూప్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సొరకాయలో విటమిన్ బి, ఫైబర్, నీరు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో జీవక్రియ రేటును పెంచటంలో సహాయపడి జీర్ణ వ్యవస్థ పనితీరు వుండేలా చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
Bottle Gourd
అంతేకాకుండా ఆకలిని నియంత్రించడంలో చాలా బాగా సహాయ పడటం వల్ల బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన బరువు తగ్గటమే కాకుండా అలసట., నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

సొరకాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. నిమ్మరసం, తేనె వంటి వాటిని కలుపుకోవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనెను వాడకూడదు. ప్రతిరోజు ఉదయం సమయంలో ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే అధిక బరువు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి పోతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ వంటివి కూడా నియంత్రణలో ఉంటాయి.

యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఒక 15 రోజులు ఈ జ్యూస్ తాగితే తేడా మీరే గమనించి చాలా ఆశ్చర్యపోతారు. సొరకాయ 365 రోజులు మనకి సులభంగా అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగి ఆరోగ్యంగా ఉండండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.