వీటిని తింటే మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేలా చేసి జ్ఞాపక శక్తి సమస్యలు లేకుండా చేస్తుంది
Brain Foods : శరీరంలో అన్నీ అవయవాలు పనితీరు మెదడు అదేశానుసారమే ఉంటుంది. అటువంటి మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే మెదడు పనితీరు మెరుగు అవ్వటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
వాల్ నట్స్
మెదడు పనితీరుకు మరియు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి వాల్ నట్స్ సహాయపడతాయి. వాల్ నట్స్ లో ఉండే ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ ని అభివృద్ధి చేస్తుంది .ప్రతి రోజు 2 వాల్ నట్స్ తింటే మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ ని తగ్గిస్తుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. మామూలు చాక్లెట్ కన్నా డార్క్ చాక్లెట్ బాగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే రోజు చిన్న ముక్క దత్క్ చాక్లెట్ తినాలి.
పుదీనా
పుదీనా వాసన మెదడు పనితీరును మెరుగుపరచటానికి మెదడు చురుగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది. మెదడు పవర్ పెరగాలంటే పుదీనా టీ రోజు విడిచి రోజు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
టమోటా
టమోటాలో లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన మెదడు కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. టమోటాను వారంలో మూడు సార్లు ఆహారంలో బాగంగా చేసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.