Healthhealth tips in telugu

1 గ్లాసు 3 రోజులు తాగితే మోకాళ్ళ నొప్పులు,మెడ నొప్పి,నడుము నొప్పి వంటి నొప్పులు ఉండవు

Joint Pains Home Remedides :ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా ఏదొక నొప్పితో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉన్నారు. ఇలా నొప్పులు వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇప్పుడు చెప్పే పాలను తాగితే చాలా తొందరగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే పాలను తయారుచేసుకోవటానికి కేవలం 3 ఇంగ్రిడియన్స్ సరిపోతాయి.
Ginger benefits in telugu
అంగుళం సైజ్ అల్లం ముక్కను తీసుకొని తొక్క తీసి తురమాలి. ఆ తర్వాత 3 మిరియాలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోసి దానిలో తురిమిన అల్లం, దంచిన మిరియాలను వేసి రెండు పొంగులు వచ్చేవరకు మరిగించాలి. ఆ తర్వాత ఆ పాలను వడకట్టి తాగాలి.

రుచి కోసం పటికబెల్లం కలపవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను ఉదయం లేదా రాత్రి సమయంలో తాగవచ్చు. ఈ పాలను తాగితే మోకాళ్ళ నొప్పులు,మెడ నొప్పి,నడుము నొప్పి వంటి అన్నీ రకాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లం,మిరియాలలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.