ఈ 7 ఆహార పదార్ధాలను తింటే డయాబెటిస్ అనేది జీవితంలో ఉండదు…ఇది నిజం
Diabetes herbal remedies : డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడవలసిందే. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం కూడా డయాబెటిస్ ఉన్నవారిలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఆహారాలను తీసుకుంటే మంచిది. ఆ ఆహారాలను గురించి తెలుసుకుందాం.
దాల్చినచెక్క డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్సీకరణ ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి దాల్చినచెక్క సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఉదయం టిఫిన్ చేసినప్పుడు టిఫిన్ మీద దాల్చినచెక్క పొడి జల్లుకొని తినవచ్చు.
కరివేపాకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఉదయం సమయంలో 5 కరివేపాకు ఆకులను నమిలి మింగవచ్చు. లేదా కషాయం చేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకును పొడిగా చేసుకొని అన్నంలో మొదటి ముద్దగా తినవచ్చు. కరివేపాకును ఏ రూపంలో తీసుకున్న మంచి ఫలితం వస్తుంది.
మెంతులు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి మరియు గ్లూకోజ్ఆధారిత ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. రాత్రి సమయంలో అరస్పూన్ మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను నములుతూ ఆ నీటిని తాగాలి.
అల్లంలో ఉన్న లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి మరియు ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున అంగుళం అల్లం ముక్కను కషాయంగా చేసుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.
నేరేడు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో చక్కెర స్థాయిలను తగ్గించగల హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండుట వలన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సీజన్ లో దొరికినప్పుడు అసలు మిస్ కాకుండా తినటం అలవాటు చేసుకోవాలి. నేరేడు జ్యూస్ సంవత్సరం మొత్తం మార్కెట్ లో లభ్యం అవుతుంది.
కాకరకాయలో సెరోటోనిన్ మరియు మోమాటిసిన్ అనే రెండు ముఖ్యమైన సమ్మేళనాలు ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. కాకరకాయ రసాన్ని ఉదయం సమయంలో తాగితే మంచిది.
వేప ఆకులో ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పెనాయిడ్స్, యాంటీవైరల్ సమ్మేళనాలు మరియు గ్లైకోసైడ్ లు సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. ఉదయం రెండు వేప ఆకులను నమిలి మింగవచ్చు. లేదా వేప కాషాయన్ని చేసుకొని తాగవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.