Healthhealth tips in telugu

టమోటా+కీరదోస కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

Tomato cucumber juice : కీరదోస,టమోటాలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా మందిని వేదిస్తుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి టమోటా,కీరదోస రెండు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీని కోసం ఒక జ్యూస్ తయారు చేసుకోవాలి.

ఒక మిక్సీ జార్ లో ఒక టమోటా ముక్కలు, కీరదోసలో సగాన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 10 పుదీనా ఆకులు,రెండు మిరియాలు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేసి గ్లాసులో పోసి అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. టమోటా,కీరదోస రెండింటిలో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ డ్రింక్ ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/