ఈ లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టే…అసలు అశ్రద్ద చేయకూడదు
kidney stones In Telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొంత మందికి కిడ్నీలో రాళ్ళు ఉన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు చెప్పే లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నప్పుడూ బొడ్డుకు కింది భాగంలో మరియు నడుము భాగంలో నొప్పి వస్తుంది.
రెగ్యులర్ గా జ్వరం వస్తూ ఉంటే కూడా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అనుమానించాలి. కళ్ళు తిరగటం, పడిపోతున్న భావన కలగటం,కడుపులో తిప్పినట్టు ఉండి వాంతులు అవ్వటం వంటి లక్షణాలు ఉంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్టు అనుమానించాలి. మూత్రం పచ్చగా ఉండటంతో పాటు ఘాటైన వాసన లేదా దుర్వాసన ఉంటే కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు.
కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడూ వెన్ను నొప్పి కూడా వస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడూ మంచి నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉంటే మాత్రం ఎటువంటి అశ్రద్ద చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.