వంటల్లో ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా…. ఈ ఆర్టికల్ మీరు తప్పకుండా చదవాల్సిందే
oilve Health Benefits : మన పురాతన కాలం నుండి ఆలివ్ ఆయిల్ వాడకంలో ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆలివ్ ఆయిల్ వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకొని వంటల్లో వాడటం బాగా పెరిగింది. ఆలివ్ పండ్ల నుండి ఆలివ్ నూనెను తయారుచేస్తారు. ఈ మధ్య కాలంలో ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఆలివ్ ఆయిల్ వాడకం కూడా బాగా ఎక్కువయింది.
ఆలివ్ ఆయిల్ ని ప్రాచీన కాలంలో ‘లిక్విడ్ గోల్డ్’ అని పిలిచేవారు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్నే సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ లో ఉన్న ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇటీవల జరిపిన అధ్యయనాలలో ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని తేలింది. ఆలివ్ ఆయిల్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉండుట వలన శరీరంలో మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది. ధమనుల పనితీరుకు అడ్డంకుగా ఉన్న కొవ్వును తొలగించి, ధమనుల యొక్క రక్త ప్రసరణలను మెరుగ్గా ఉండేలా చేస్తుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఆలివ్ ఆయిల్ యాంటిడిప్రెసెంట్గా పనిచేస్తుంది. అంతేకాక సెరోటోనిన్ యొక్క స్థాయిలను పెంచుతుంది. సెరోటోనిన్ అనేది ఆనందాన్ని కలిగించే హార్మోన్. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ లో ఒమేగా-3 మరియు ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉండుట వలన మెదడు యొక్క పనితీరును ప్రోత్సహిస్తూ, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది.
ఆలివ్ ఆయిల్ ని వంటల్లో వాడుట వలన రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన కీళ్ల నొప్పులు,కీళ్ల వాపులు తగ్గుతాయి. నొప్పి ఉన్న ప్రాంతంలో ఆలివ్ ఆయిల్ రాసి 10 నిముషాలు మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆలివ్ ఆయిల్ లో ఫెనోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ మరియు యాంటీ-వైరల్ గా పనిచేసి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
ఆలివ్ ఆయిల్ లో విటమిన్ E మరియు యాంటీ-ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. తద్వారా చర్మానికి తగినంత పోషణ అంది ముడతలు,వృధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ చర్మానికి చైతన్యపరచి, మృదువుగా మార్చి, చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ మేకప్ రిమూవర్ గా పనిచేస్తుంది.
ఆలివ్ ఆయిల్, జుట్టుకు కావలసిన పోషణను అందించి, జుట్టును తేమగా ఉంచుతూ, చుండ్రును పోగొట్టి, జుట్టును మరింతగా బలపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండుట వలన జుట్టు మొదళ్ల నుండి మూలాల వరకు అవసరమైన అన్ని పోషకాలు అంది జుట్టు బలంగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.