Healthhealth tips in telugu

మరిగించిన నీటిలో కొన్ని చుక్కలు వేసి ఇలా చేస్తే గొంతులో కఫం,శ్లేష్మం నిమిషాల్లో మాయం

Cold And Cough : దగ్గు వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. అలాగే గొంతులో కఫం,శ్లేష్మం వంటివి ఉన్నప్పుడూ కూడా బయటకు రావటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముందుగా కఫం,శ్లేష్మం తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే నూనెను మరిగించిన నీటిలో వేసి ఆవిరి పట్టాలి.

దీని కోసం ఒక సీసాలో 6 ml కొబ్బరి నూనె,1 ml పుదీనా నూనె,1 ml యూకలిప్టస్ నూనె, 1 ml లవంగం నూనె వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి. దగ్గు,కఫం,శ్లేష్మం ఉన్నప్పుడూ నీటిని బాగా మరిగించి ఆ నీటిలో పైన తయారుచేసుకున్న నూనెను రెండు చుక్కలు వేసుకొని ఆవిరి పట్టాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

మనం తీసుకున్న నూనెలలో కొబ్బరి నూనె తప్ప మిగతా అన్నీ నూనెలు ఘాటుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. ఈ నూనెను ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఎందుకంటే ఊపిరితిత్తులకు హాని కలిగే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో కూడా ఈ నూనెను వాడకూడదు. ఈ నూనె నొప్పులను తగ్గించటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.