పొట్టలో ఉన్న కొవ్వు వేగంగా కరగాలంటే ఉదయం టిఫిన్ తర్వాత ఈ చిట్కా ట్రై చేయండి
pomegranate weight Loss Tips : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అధిక బరువు,శరీరంలో కొవ్వు పెరుకుపోవటం వంటి సమస్యలతో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గటమే కాకుండా పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత దానిమ్మ గింజలు లేదా దానిమ్మ గింజల జ్యూస్ తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం మధ్యలో ఎటువంటి చిరుతిళ్లు తినకుండా ఇలా దానిమ్మ గింజలు తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. దానిమ్మ గింజలలో ఉండే ఫైబర్, విటమిన్ సి ,బి వంటి పోషకాలు శరీరంలో జీవక్రియ రేటును పెంచుతాయి.
దాంతో శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. అలాగే మనం భోజనం చేసినప్పుడు సరిగ్గా అరగకపోయినా కూడా అది శరీరంలో కొవ్వుగా మారుతుంది. అటువంటి జీర్ణ సమస్యలన్నీ తొలగించడంలో దానిమ్మ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతి రోజు దానిమ్మ గింజలు లేదా జ్యూస్ తీసుకోవటం వలన హార్మోన్ల అసమతుల్యత తగ్గిపోతుంటుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు దానిమ్మ పండ్లను తింటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.