ఈ పప్పులను ఇలా తీసుకుంటే కడుపులో మంట, శరీరంలో వేడి ,గ్యాస్ సమస్యలు ఉండవు
Pulses In summer : ఈ వేసవిలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి మన వంటింటిలో ఉండే పప్పులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో ఎక్కువ కారం ఉన్న ఆహారాలు, డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తీసుకోవటం వలన కడుపులో మంట, శరీరంలో వేడి ,గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని పప్పులను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.
పెసరపప్పు శరీరంలో వేడిని తగ్గించటానికి సహాయపడుతుంది. మన ఆముమ్మల కాలం నుండి పెసరపప్పును వేసవికాలంలో వాడుతున్నారు. ఈ పప్పులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. వీటిలో ఉన్న పోషకాలు శరీరాన్ని పటిష్టంగా ఉంచుతాయి.
మినపప్పును పొట్టు ఉన్న పప్పును వాడాలి. శరీరంలో మంటను తగ్గించటమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా ఆస్తమా రోగులు మినప పప్పు తీసుకోవడం చాలా మంచిది.
శనగలలో మాంసకృత్తులు సమృద్దిగా ఉండుట శరీరానికి అవసరమైన శక్తి లభించి వేసవిలో ఉండే అలసట,నీరసం వంటివి ఏమి లేకుండా చేస్తుంది. వేసవిలో శరీరంలో వేడిని తగ్గిస్తుంది, శనగలతో కూర చేసుకోవచ్చు. లేదా ఉడికించుకొని తినవచ్చు. ప్రతి రోజు ఒక స్పూన్ శనగలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన శనగలను తింటూ ఆ నీటిని తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.