100 ఏళ్ళు వచ్చినా నరాల బలహీనత,ఎముకల బలహీనత,కీళ్ళ నొప్పులు,నిద్రలేమి సమస్యలు ఉండవు
Nerve weakness Milk : ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు రాకుండా ఉండాలన్న ఇప్పుడు చెప్పే పాలను కనీసం వారంలో రెండు సార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. నరాల బలహీనత,ఎముకల బలహీనత,కీళ్ల నొప్పులు,నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పాలు బాగా సహాయపడతాయి.
ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 6 లవంగాలు,చిటికెడు పసుపు, 10 కరివేపాకు ఆకులు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి గ్లాసులోకి వడకట్టి తాగాలి. ఈ పాలను రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు.
సమస్యలు ఉన్న వారు 15 రోజులు తాగితే సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఏ సమస్యలు లేనివారు వారంలో రెండు సార్లు తాగితే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. నరాల బలహీనత,ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలసట,నీరసం లేకుండా తక్షణ శక్తిని ఇస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.