శొంఠి పొడిని రెగ్యులర్ గా తింటే శరీరంలో ఏమి అవుతుందో తెలుసా?
sonti Powder Benefits In telugu :పురాతన కాలము నుండి శొంఠి పొడిని వాడుతున్నారు. అలాగే ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పచ్చి అల్లంను పాలల్లో నానబెట్టి ఎండబెట్టి శొంఠిని తయారుచేస్తారు. శొంఠిని నెయ్యి లేదా నూనెలో వెగించి పొడి చేసి శొంఠి పొడిని తయారుచేస్తారు.
శొంఠి పొడిని రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే దగ్గు,జలుబు వంటి వాటి నుండి రక్షిస్తుంది. ఒక గ్లాస్ వేడి నీటిలో పావు స్పూన్ శొంఠి పొడి వేసి బాగా కలిపి తాగితే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి తగ్గటమే కాకుండా శరీరంలో పెరుకుపోయిన కొవ్వు కరిగి అధిక బరువు కూడా తగ్గుతారు.
ఒక గ్లాస్ వేడి పాలల్లో పావు స్పూన్ శొంఠి పొడి వేసి బాగా కలిపి తాగితే శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అలాగే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే అజీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.