Healthhealth tips in telugu

ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఈ పండులో ఉన్న రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Rose Apple Benefits in Telugu :నేరేడు కుటుంబానికి చెందిన రకమే రోజ్ యాపిల్ (Rose Apple). దీని శాస్త్రీయ నామం సిజీజియం జ్మబొస్. ఈ వృక్షం కాసే రోజ్ యాపిల్ పళ్ళు తినడానికి నాటు గులాబీ రేఖల రుచి కలిగి ఉంటుంది. ఈ రకం ఎక్కువగా ఆగ్నేయపు ఆసియా దేశాల్లో కనిపిస్తుంది. భారత దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో కనిపిస్తుంది.
rose apple
ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలలోను కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తున్నది.తీపి మరియు సువాసనగల గుండ్రని ఆకారపు పండ్లను ఉత్పత్తి చేస్తుంది. రోజ్ యాపిల్ లో కార్బోహైడ్రేట్లు,ప్రోటీన్,విటమిన్-ఎ,థయామిన్ (B1 ),రైబోఫ్లావిన్ (B2 ), నియాసిన్ (B3 ,కాల్షియం,ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్,ఫాస్ఫరస్,పొటాషియం,సోడియం,జింక్ సమృద్దిగా ఉంటాయి.

రోజ్ ఆపిల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది అనేక రకాల బ్యాక్టీరియా యొక్క పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ పండ్లలో అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం కంటెంట్ రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది, ఇది గుండెకు సంబందించిన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.దీనిలో నియాసిన్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

జీవక్రియను పెంచడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఈ పండు సహాయపడుతుంది. దాంతో డయబెటిస్ ఉన్నవారిలో నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రోజ్ ఆపిల్ మూత్రపిండాల పనితీరుకు సహాయపడే మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. కిడ్నీ సమస్యలు లేకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. జ్వరం,తలనొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుందని “ఇంటర్నేషనల్ ఆర్కైవ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ” లో ప్రచురించబడిన అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. తలనొప్పిని తగ్గించే సామర్ధ్యం కూడా కలిగి ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.