నాగార్జున, రమేష్ బాబు, జగపతి బాబు మధ్య గల ఈ పోలిక గురించి తెలుసా ?
Tollywood Heroes : అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రమేష్ బాబు, జగపతి ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా జగపతి బాబు ఈ ముగ్గురూ కూడా హిందీలో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. పైగా యాదృచ్చికంగా దర్శకుడు వి.మధుసూదన రావు చేతుల మీదుగా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.
ఇందులో నాగార్జున, జగపతి బాబు హీరోలుగా తమ కంటూ ఎస్టాబ్లిష్ అయ్యారు. అయితే రమేష్ బాబు ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాలేదు. ఇక ఈ మధ్య హఠాన్మరణం చెందారు.అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన వెలుగు నీడలు, సుడిగుండాలు సినిమాల్లో బాల నటుడిగా నటించిన నాగార్జున ఆ తర్వాత హిందీలో జాకీ ష్రాఫ్, మీనాక్షి శేశాద్రి హీరో, హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన హీరో మూవీకి రీమేక్‌గా 1986లో తెరకెక్కిన విక్రమ్ మూవీతో హీరో అయ్యాడు.
సినిమా హిట్ అయింది. ఇక బాల నటుడిగా నటించిన అనుభవం గల రమేష్ బాబు 23 ఏళ్ల వయసులో సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అప్పటికే ఎన్టీఆర్, కృష్ణ మధ్య మాటలు లేవు. ఇక ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు ఛీఫ్ గెస్ట్ గా వచ్చారు. హిందీలో సన్నిడియోల్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ బేతాబ్ తెలుగులో రీమేక్ గా సామ్రాట్ పేరుతొ వచ్చింది.
అయితే ఈ మూవీకి ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబు మొదటి ఒక షెడ్యూల్ డైరెక్ట్ చేసారు. అయితే డబ్బు ఖర్చువుతున్నప్పటికీ షూటింగ్ ముందుకు సాగకపోవడంతో సీనియర్ దర్శకుడు మధుసూదన రావుని డైరెక్టర్ గా తీసుకున్నారు. అలా తొలిమూవీ సూపర్ హిట్ అయింది. ఖత్రోం కే ఖిలాడి మూవీకి రీమేక్ గా సింహ స్వప్నం మూవీతో జగపతి బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వగా, మధుసూదనరావు డైరెక్ట్ చేసారు. జగపతి బాబు తండ్రిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్యపాత్ర చేసారు. జగపతి బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ ఆడలేదు.