Healthhealth tips in telugu

వీటిని ఉడికించి తింటే చాలు కొలెస్ట్రాల్,డయాబెటిస్,గుండె సమస్యలు ఉండవు

Brown basmati rice Benefits : మనం సాదరణంగా ఫ్రైడ్ రైస్, పలావ్, బిరియాని చేసుకున్నప్పుడు సాదారణ బాసుమతి రైస్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా Brown basmati rice వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బియ్యాన్ని తినటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
blood
రక్త నాళాల్లో రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు కూడా నియంత్రణలో ఉండుట వలన గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బియ్యంలో విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్దిగా ఉంటుంది. ధియామిన్ అనే రసాయన పదార్ధం ఉండుట వలన మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అలాగే నియాసిన్ మరియు ధియామిన్ అనేవి నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

గ్లైజమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి ఉండవు. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కొన్ని రకాల క్యాన్సర్ ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో 3 ఔన్సుల తృణధాన్యాలు (Brown basmati rice) చేర్చడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని 17% తగ్గించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/