ఈ ఆకును అందరూ చూస్తారు…కానీ ఈ ఆకు రహస్యం ఎవరికి తెలియదు
Raavi Aaku benefits : రావి చెట్టును హిందువులు మరియు బౌద్ధులు పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. అందువల్ల రావిచెట్టును బోధివృక్షం అని కూడా పిలుస్తారు. భోది చెట్టు కింద బుద్దుడికి జ్నానోదయం అయింది. రావి చెట్టును అందరూ చూస్తారు. అందరు పూజిస్తారు. కానీ రావి ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎవరికీ తెలియదు.
రావి ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రావి ఆకులకు అనేక రోగాలను మాయం చేసే శక్తి ఉంది. చర్మ వ్యాధులు, ఆస్తమా, మలబద్దకం,కిడ్నీ సమస్యలు,పాము కాటు వంటి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. పాము కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల విషం ప్రభావం తగ్గుతుంది.
లేత రావి ఆకులను తినటం లేదా రావి ఆకులను నీటిలో వేసి మరిగించి తయారుచేసిన కషాయాన్ని త్రాగిన చర్మంపై దురదలు,ఇతర చర్మ సమస్యలు తగ్గుతాయి. రావి ఆకులు మలబద్దకం సమస్యను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. రావి ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేయాలి. దానికి సోంపు గింజల పొడి , బెల్లం సమపాళ్లలో కలపాలి.
ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. రోజుకు 5-10 రావి పండ్లను తిన్నా సమస్య పూర్తిగా దూరం అవుతుంది. కాలి మడమలు పగిలినప్పుడు ఆ ప్రదేశంలో రావి ఆకుల పేస్ట్ రాసి రెండు నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే కాలి మడమల పగుళ్లు తొలగిపోతాయి. కామెర్ల వ్యాధికి రావి ఆకు మంచి మందు అని చెప్పవచ్చు.3-4 తాజా రావి ఆకులు తీసుకొని దానికి పట్టిక బెల్లం కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని పావు లీటర్ నీటిలో కలిపి వడగట్టాలి. రోజుకు రెండుసార్ల చొప్పున ఐదు రోజులపాటు ఈ మిశ్రమాన్ని తాగించడం వల్ల కామెర్లు తగ్గుముఖం పడతాయి.
కడుపు నొప్పితో భాదపడుతున్నవారు రెండు మూడు రావి ఆకులను పేస్ట్‌గా చేసుకొని 50 గ్రాముల బెల్లంలో కలిపి చిన్న మాత్రలుగా చేసుకోవాలి. మూడు పూటలా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/