Health

తమలపాకు ఎక్కువగా తినే అలవాటు ఉందా… ఈ 3 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

Tamalapaku benefits : ప్రతి పూజాలోను తమలపాకును ఉపయోగించటం మన భారతీయ సాంప్రదాయం. నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు  మూడు   తమలపాకులు కూడా ఇస్తారు. తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు.

Tamalapaku Health benefits In telugu

తమలపాకులో  కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు,  ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.తమలపాకును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.  తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన యాంటీ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది. తమలపాకు జీర్ణప్రక్రియలో ఆకుకూరల కన్నా ఎక్కువ మేలు చేస్తుంది.

తమలపాకు రసానికి కొబ్బరినూనె కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు,కఫము వంటి శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ తమలపాకు రసంలో అరస్పూన్ తేనే కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తమలపాకులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నట్టు వెల్లడి అయింది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రెగ్యులర్ గా తమలపాకు తీసుకుంటే రక్తంలో చెక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా మలబద్దకం సమస్య ఎక్కువ అయింది.

ఈ సమస్య పరిష్కారానికి తమలపాకు చాలా బాగా సహాయాపడుతుంది. లేత తమలపాకులను వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశం మరియు దెబ్బలు తగిలినప్పుడు  వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగిన ప్రదేశంలో పెడితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.