Healthhealth tips in telugu

ఈ నూనెను ఇలా వాడితే 7 రోజుల్లో మైగ్రేన్‌ తలనొప్పికి చెక్ పెట్టవచ్చు

Migraine headache : ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ తలనొప్పి రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ తలనొప్పి వచ్చిందంటే భరించటం చాలా కష్టం. ఈ నొప్పి నుండి ఉపశమనం కొరకు ఈ రోజు ఒక నూనె గురించి తెలుసుకుందాం.ఈ నూనె కోసం శంఖు పువ్వులను ఉపయోగిస్తున్నాం.

పది శంఖు పువ్వులను తీసుకొని రేఖలను విడతీసి శుభ్రంగా కడిగి తడి ఆరేవరకు బాగా ఆరబెట్టాలి. ఒక గిన్నె లో నీటిని పోసి దానిలో మరొక గిన్నె ను పెట్టి దానిలో 150 Ml కొబ్బరి నూనెను పోసి దానిలో శంఖు పువ్వు రేకలను వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగిస్తే ఆ పువ్వులలో ఉన్న పోషకాలు అన్నీ నూనెలోకి చేరతాయి.

నూనె చల్లారాక సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు తలకు బాగా పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మైగ్రేన్‌ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఈ రెమిడీ ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఈ తలనొప్పి కొందరిలో ఇది పార్శ్వ భాగానికే పరిమితమైతే.. మరికొందరిలో తలమొత్తం నొప్పి వస్తుంది. కళ్లు మూతలు పడుతుండటం, ముక్కు చుట్టూ ఏదో కదులుతున్నట్లు అనిపించడం, తలమీద సుత్తితో బాదుతున్నట్లు అనిపించడం ఈ మైగ్రేన్‌ తలనొప్పి లక్షణాలు. ఈ సమస్య ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/