వేసవిలో వీటిని తీసుకుంటే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా అలసట,నీరసం,నిస్సత్తువ ఉండవు
Summer Foods : వేసవికాలం ఎండలు ప్రారంభం అయ్యాయి. ఈ కాలంలో ఆకలి వేసిన తినాలని కోరిక లేకపోవటంతో తినటం అశ్రద్ద చేస్తూ ఉంటారు. దాంతో నీరసం,అలసట వంటివి వచ్చేస్తాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి కూడా ఉండదు. అందువల్ల వేసవిలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి.
వేసవిలో పుచ్చకాయ తినటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా పుచ్చకాయలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా శరీరంలో అలసట,నీరసం తగ్గించి హుషారుగా ఉండేలా చేస్తుంది.
అరటిపండు కూడా ఈ వేసవిలో ఎన్నో రకాలుగా మనకు సహాయపడుతుంది. అరటిపండులో పొటాషియం, విటమిన్ బి ,ఫైబర్ వంటివి సమృద్దిగా ఉండుట వలన అలసట,నీరసం వంటి వాటిని తగ్గించటమే కాకుండా జీర్ణ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అరటిపండు తింటే కడుపు నిండిన బావన కూడా ఎక్కువసేపు ఉంటుంది. రోజుకి రెండు అరటిపండ్లకు మించి తీసుకోకూడదు.
విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ప్రొటీన్లు సమృద్దిగా లభించే గుమ్మడి గింజలను ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే వేసవిలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలసట,నీరసం లేకుండా శరీరంలో శక్తి ఉండేలా చేస్తుంది. వీటిని పొడిగా చేసుకొని పాలల్లో కలిపి తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.