Healthhealth tips in telugu

అవిసె గింజలు Vs గుమ్మడి గింజలు… ఏది తింటే మంచిది…నమ్మలేని నిజాలు

Pumpkin seeds vs Flaxseeds : ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. అవిసె గింజలు,గుమ్మడి గింజలు రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవిసె గింజలలో ఒమేగా ఫ్యాటి యాసిడ్స్, ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన సూపర్ ఫుడ్ గా పిలుస్తారు.

అవిసె గింజలను తీసుకుంటే డయాబెటిస్,మలబద్దకం,అధిక కొలెస్ట్రాల్,గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. అవిసె గింజలు నొప్పులను తగ్గించటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. గుమ్మడి గింజలలో మెగ్నీషియం,జింక్ చాలా సమృద్దిగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి సహాయపడుతుంది.

గుమ్మడి గింజలతో పోలిస్తే అవిసె గింజలలో కొంచెం ఎక్కువ పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ సమృద్దిగా అందాలంటే చికెన్ కి బదులు అవిసె గింజలు, గుమ్మడి గింజలను తీసుకుంటే సరిపోతుంది. గుమ్మడి గింజలతో పోలిస్తే అవిసె గింజలలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల ప్రేగు కదలికలు బాగా జరిగేలా చేసి జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.

ప్రతి రోజు ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ గుమ్మడి గింజలను విడి విడిగా రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసు కోవాలి. అలా కుదరని వారు పొడిగా తయారుచేసుకొని పాలల్లో లేదా నీటిలో కలిపి తీసుకున్నా సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.