క్యారెట్ Vs బంగాళాదుంప… ఏది తింటే మంచిది…నమ్మలేని నిజాలు
Carrot vs Potato benefits : క్యారెట్,బంగాళాదుంప రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్ మరియు బంగాళాదుంప రెండూ వేరు నుంచి వచ్చే కూరగాయలు. ఈ రెండింటినీ సూపర్ ఫుడ్ గా చెప్పుతారు. క్యారెట్ విషయానికి వస్తే విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి. క్యారెట్‌లో జియాక్సాంటిన్ మరియు లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ డ్యామేజ్ ప్రమాదాన్ని తగ్గించి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డైటరీ ఫైబర్ ఉండుట వలన జీర్ణ ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. పొటాషియం ఉండుట వలన రక్తనాళాలను సడలించి రక్తప్రవాహం బాగా సాగేలా చేస్తుంది.
బంగాళదుంపలో విటమిన్ సి మరియు బి6, ప్రోటీన్ మరియు మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. బంగాళదుంపలలో ఫినాలిక్ యాసిడ్, కెరోటినాయిడ్లు మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి రసాయన పదార్థాలు సమృద్దిగా ఉండుట వలన యాంటీఆక్సిడెంట్ల వలె పని చేసి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి.
బంగాళాదుంప జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచి ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. బంగాళదుంపలో ఫైబర్ సమృద్దిగా గ్లూటెన్ రహితంగా కూడా ఉంటాయి. బంగాళాదుంపతో పోలిస్తే క్యారెట్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. క్యారెట్ లో ఎక్కువ పోషకాలు తక్కువ కేలరీలు ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/