పెరుగుతో ఈ 4 పదార్ధాలు కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
Curd Health tips : పెరుగులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవికాలంలో వేడి తగ్గటానికి ఖచ్చితంగా ప్రతి రోజు పెరుగు తినాలి. భోజనంలో పెరుగు అన్నం లేనిదే భోజనం పూర్తి కానట్టు భావిస్తారు కొంతమంది. మరి కొంతమంది భోజనంలో అసలు పెరుగు తినటానికి ఆసక్తి చూపరు. పెరుగులో ప్రోబయోటిక్ ఉండుట వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
ఒక కప్పు పెరుగులో అరస్పూన్ జీలకర్ర కలిపి తింటే అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. గ్యాస్,ఎసిడిటీ,కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంద సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కడుపు నొప్పి వచ్చినప్పుడు పెరుగులో జీలకర్ర కలిపి తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ పంచదార కలిపి తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన శక్తి లభించి రోజంతా అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉంటారు.
ఒక కప్పు పెరుగులో రెండు చిటికెలు సైండవ లవణం కలిపి తీసుకుంటే వేసవిలో వచ్చే సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వేసవిలో వచ్చే జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పెరుగు,కోడి గుడ్డు కలిపి తింటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పంటి నొప్పి, పంటికి సంబందించిన సమస్యలు ఉన్నప్పుడు పెరుగు,Egg కలిపి తింటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అలాగే నోటి అల్సర్ ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/