Healthhealth tips in telugu

నాలుగు నోట్లో వేసుకుంటే చాలు రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా శరీరంలో కొవ్వు కరిగిపోతుంది

Kiwi Fruit benefits : కివి పండ్లు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి. రోజుకి ఒక పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కివి పండ్లు డ్రై గా కూడా లభ్యం అవుతాయి. సీజన్ కానప్పుడు డ్రై గా ఉన్న కివి తినవచ్చు. కివిలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కివిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఆస్త్మా ఉన్నవారికి చాలా మేలును చేస్తుంది. కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేసి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.

డయాబెటిస్ ఉన్నవారు కూడా వారానికి రెండు సార్లు కివి పండును తినవచ్చు. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి కివి పండు ఒక వరం అని చెప్పవచ్చు. ఫైబర్, తక్కువ కొవ్వు ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అలాగే నీరసం లేకుండా శక్తి ఉండేలా చేస్తుంది.

కివిలోని విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు మీ శరీరం కొల్లాజెన్‌ను సంశ్లేషణ చేయడంలో సహాయపడతాయి, ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోర్లు మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. కొల్లాజెన్ మీ చర్మానికి హాని కలిగించే పర్యావరణ టాక్సిన్స్ మరియు ఇతర వ్యాధికారకాలను ఫిల్టర్ చేస్తుంది, ముడుతలను తగ్గించి చర్మం మృదువుగా మెరిసేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.