ఈ 3 నానబెట్టి ఇలా తింటే దాదాపుగా 20 కి పైగా రోగాలు నయం అవుతాయి
Soaked grains health benefits : అవిసె గింజలు ,మెంతులు,కలోంజీ గింజలను నానబెట్టి తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మూడింటిని ఒకొక్కటి అరస్పూన్ మోతాదులో తీసుకొని దాదాపుగా 5 గంటలు నానబెట్టాలి. నానిన వీటిని తింటూ ఆ నీటిని తాగేయాలి. లేదా ఈ మూడింటిని పొడిగా చేసుకొని చపాతీ,అట్లు వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు.
ఇలా 15 రోజుల పాటు తీసుకుంటే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి,అధిక బరువు వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. జుట్టుకి సంబందించిన సమస్యలు ఉండవు. అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జీవక్రియ రేటును పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
వీటిని మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువగా తీసుకుంటే వేడి చేసే అవకాశం ఉంది. నొప్పులను తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేని వారు వారంలో 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది.
గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా ఎన్నో రకాల సమస్యలను తగ్గించటానికి అవిసె గింజలు,మెంతులు, కలోంజీ గింజలు సహాయపడతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో తీసుకుంటే వేసవిలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/