అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేసి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారసులు
Tollywood young heros as assistant directors : సినిమా ఫీల్డ్ లో వారసత్వానికి కొదవలేదు. అయితే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ ఉంటేనే నిలబడతారు. లేకుంటే షెడ్డుకి వెళ్లిపోవాల్సిందే. అయితే ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు కొత్త హీరోలు ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేసినవాళ్లు కావడం విశేషం.
అందులో మొదటగా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా అశోక్ ని ప్రస్తావించాలి. విదేశాల్లో ఫిలిం కోర్సులు పూర్తిచేసి, శ్రీమంతుడు మూవీకి డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ గా చేసాడు. ఇక చైల్డ్ ఆర్టిస్టుగా కూడా చేసాడు. ఇప్పుడు హీరో మూవీతో హీరోగా సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు.
మరోపక్క బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్. రౌడీ బాయ్స్ మూవీతో సంక్రాంతికి సందడి చేసాడు. కేరింత మూవీకి అసిస్టెంట్ గా చేసిన యితడు ముంబై, అమెరికాలో ఫిలిం శిక్షణ పొందాడు. అశోక్, ఆశిష్ లు తమ టాలెంట్ తో సత్తా చాటుతారో కనుమరుగవుతారో చూడాలి.