కిడ్నీలో రాళ్ళు,కిడ్నీ సంబందిత సమస్యలు, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే జ్యూస్ లు
Kidney Stones : ప్రస్తుతం మారిన పరిస్థితులు కారణంగా చాలా చిన్న వయస్సులోనే కిడ్నీలో రాళ్ళ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నప్పుడూ విపరీతమైన బాధ ఉంటుంది. కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నప్పుడూ డాక్టర్ సూచించిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే జ్యూస్ లను తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
ఒక కప్పులో దానిమ్మరసం తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటే క్రమంగా కిడ్నీలో రాళ్ళు చిన్నవిగా ఉన్నవి కరిగిపోతాయి. పెద్ద రాళ్ళు ఉంటే మాత్రం మందులు తప్పనిసరిగా వాడాలి.
ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ నిమ్మరసం,సరిపడా ఉప్పు వేసి తాగుతూ ఉండాలి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ళను తొలగించడంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పెరుగు,నిమ్మరసం మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇంటి చిట్కాల ద్వారా కిడ్నీలో రాళ్ళను తొలగించుకోవచ్చు.
తులసి కూడా కిడ్నీలో రాళ్ళను తొలగించటానికి సహాయపడుతుంది. ఒక స్పూన్ తులసి ఆకుల రసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు కరిగిపోతాయి. ఇప్పుడు చెప్పిన మూడు జ్యూస్ లలో ఒక దాన్ని ఎంచుకొని తీసుకొని కిడ్నీ సమస్యల నుండి బయట పడండి. ఈ జ్యూస్ లు తాగటం వలన చెడు కొలెస్ట్రాల్ కూడా తొలగిపోతుంది
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.