జాయింట్ పెయిన్స్,నడుము నొప్పి,ఎముకల బలహీనత తగ్గించి జీవితంలో Calcium లోపం ఉండదు
Best ayurvedic remedies for arthritis : ఒకప్పుడు కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి వంటి సమస్యలు 60 ఏళ్ల వయస్సు వారిలో కనిపించేవి. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా చాలా చిన్న వయస్సులోనే అంటే 30 ఏళ్ళు వచ్చేసరికి నొప్పులు వచ్చేస్తున్నాయి. దాంతో కంగారూ పడి మార్కెట్ లో దొరికే మందుల వైపు చూస్తున్నారు.
అలా కాకుండా మన ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో సులభంగా నొప్పులను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను డయాబెటిస్ ఉన్నవారు అయితే ఈ విధంగా ఫాలో అవ్వాలి. నువ్వులను దోరగా వేగించి పొడిగా తయారుచేసుకొని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ విధంగా రోజు తీసుకుంటే చాలా మంచి ఫలితం కనపడుతుంది. ఈ చిట్కాను డయాబెటిస్ లేని వారు కూడా ఫాలో అవ్వవచ్చు.
ఇక డయాబెటిస్ లేని వారు ఈ చిట్కా ఫాలో అవ్వవచ్చు.ఒక కప్పు నువ్వులను పాన్ లో వేసి దోరగా వేగించాలి. వేగిన నువ్వులను చల్లార్చి ఒక సీసాలో పోసి ఒక కప్పు తేనెను కలపాలి. ఇది దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనిని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి.
ఈ విధంగా తీసుకుంటే Calcium లోపం తొలగిపోయి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి వంటివి అన్నీ తొలగిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. Calcium లోపం కారణంగా వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.