పటికబెల్లం+గసగసాలతో ఇలా చేస్తే ఎన్నో ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
Patika Bellam Health benefits In telugu :తియ్యని రుచితో ఉండే పటిక బెల్లంను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని లిమిట్ గా తీసుకుంటే ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. వాత,పిత్త,కఫ దోషాల వల్ల వచ్చే అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. పంచదారను ప్రొసెస్ చేయటానికి ముందు రూపమే పటిక బెల్లం.
రెండు స్పూన్ల పటిక బెల్లం పొడి రెండు స్పూన్ల గసగసాలు మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక స్పూన్ పొడిని వెన్నలో కలిపి తింటే గర్భదరణ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి,కండరాలు బిగదీయటం, రక్త విరేచనాలు,జిగత విరేచనాలు వంటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిన తగ్గిపోతాయి.
ఎక్కిళ్ళు అనేవి వచ్చాయంటే ఒక్కోసారి ఒక పట్టానా తగ్గవు. అలాంటి సమయంలో ఎండు కొబ్బరి పొడిలో పటికబెల్లం పొడి కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఒక వేడి పాలల్లో ఒక స్పూన్ పటికబెల్లం పొడి కలిపి తాగితే స్వరపేటికకు సంబందించిన సమస్యలు ఉండవు.
అలాగే కంటి చూపు మెరుగు అవుతుంది. ఇలా లింలి గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఎక్కువగా తీసుకుంటే మాత్రం మలబద్దకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా తీసుకొని ఈ ప్రయోజనాలు పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.